![]() |
![]() |
.webp)
తెలంగాణ యాసలో మాట్లాడుతూ జోర్దార్ వార్తలు చదివే సుజాత అందరికీ తెలిసిన అమ్మాయే. బిగ్ బాస్ కి వెళ్ళాకా ఆమెకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. దాంతో ఆమె మూవీస్ లో కూడా నటించింది. ఆమె యాసకి, భాషకి కామెడీ టైమింగ్ కి ఎంతో మంది అభిమానులు ఉన్నారు. సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ తో బాగా పాపులర్ అయ్యింది.
అలాంటి సుజాత రీసెంట్ గా మా అసోసియేషన్ సభ్యురాలు అయ్యింది. ఆ విషయాన్ని చాలా కవితాత్మకంగా ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకుంది. "కలవరమొక వరమనుకో కళలను కంటూప్రతి నిమిషము నీదనుకో జత పడి వుంటూ" అని పెట్టింది. నా ప్రయాణం "మా" ప్రయాణం వరకు చేరుకుంది..మా అసోసియేషన్ లో నేను సభ్యురాలిని అయినందుకు చాలా సంతోషపడుతున్న...అంతే బాధ్యతగా కూడా ఉంటా...ఇక్కడి వరకు రావడానికి మీ ఆశీర్వాద బలమే…ఇక ముందు కూడా ఇలాగే ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నా థాంక్యూ సో మచ్ " అంటూ మా తెలుగును టాగ్ చేసింది.
ఇక మా అధ్యక్షుడు హీరో మంచు విష్ణు స్వయంగా వచ్చి సుజాతకు మా సభ్యత్వం కార్డు అందించాడు. అలాగే కాసేపు సుజాత - రాకేష్ వాళ్ళ పాపతో కాసేపు గడిపారు. ఇక సుజాత మంచు విష్ణుకు, జాయింట్ సెక్రటరీ శివబాలాజీ మనోహరన్ అన్న అంటూ వాళ్లకు కూడా ధన్యవాదాలు చెప్పింది.
![]() |
![]() |